తితిదేలో ఉద్యోగ అవకాశాలు.. వేతనం రూ.1.50 లక్షలు

శుక్రవారం, 27 అక్టోబరు 2023 (14:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 56 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటిలో సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో 27 పోస్టులు ఉన్నాయి. 
 
అలాగే, సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 10, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 19 చొప్పున ఉన్నాయి. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 23వ తేదీలోపు తమ దరఖాస్తులను చేరవేయాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఏపీ, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హ్లు. బీఈ, బీటెక్ సివిల్ లేదా మెకానికల్, ఎల్‌సీఈ, ఎల్ఎంఈ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి. అభ్యర్థుల వయస్సు 42 యేళ్లకు మించరాదు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏఈఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే, ఏఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు జీతం అందిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు