కావలసిన పదార్థాలు : పాలు... రెండు కప్పులు కోకో పౌడర్... అర టీ. చాకొలెట్ పౌడర్... ఒక టీ. పంచదార... ఒకటిన్నర టీ. కాఫీ... అర టీ.
అలంకరణ కోసం... చాకొలెట్ బార్ ముక్కలు... రెండు మీగడ... అర కప్పు
తయారీ విధానం : పంచదార, కాఫీ, కోకో, చాకొలెట్ పౌడర్లను పాలలో కలిపి గిలకొట్టాలి. ఇందులోనే పాలపొడి వేసి మళ్లీ చిలకాలి. దీన్ని గ్లాస్‌లలోకి ఒంపి మీగడ, చాకొలెట్ బార్ ముక్కలను కలిపితే కోకో చాకొలెట్ మిల్క్ రెడీ అయినట్లే...! వెరైటీగా, స్పెషల్‌గా ఉండే ఈ డ్రింక్‌ను తయారు చేయడం చాలా సులభం కాబట్టి, మీరూ ట్రై చేయండి.