కొవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్ పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం సమాధానం చెప్పింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత, అత్యధిక ధరలకు అమ్మకాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వం సరిపడా ఇంజక్షన్లు సరఫరా చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 13 వేల ఇంజక్షన్లు ఇచ్చారని ప్రస్తుతం 14 వందల మంది పేషేంట్స్ ఉన్నారన్న ప్రభుత్వం తరపున న్యాయవాదులు వెల్లడించారు. ఒక్కో బ్లాక్ ఫంగస్ పేషేంట్ కి రోజుకి 3 ఇంజక్షన్లను 15 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్ పేషేంట్స్ కోసం 50 వేల ఇంజక్షన్ల అవసరం ఉందని వెల్లడించింది.
ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలుకి సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఏపీకి అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారో, ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారో మధ్యాహ్నం నాటికి చెప్పాలని హైకోర్టు సూచించింది.