Mallikarjun Kharge-Veerappa Moily
సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వదిలిపెట్టట్లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వైరస్ బాధితుల జాబితాలో చేరిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారని ఢిల్లీలోని ఖర్గే ఆఫీస్ పేర్కొంది. కోవిడ్ బారిన పడిన మల్లికార్జున ఖర్గే గత రెండు రోజుల పాటు తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.