భారత్‌కు దిగుమతి అయిన కరోనా స్ట్రెయిన్!

మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:07 IST)
బ్రిటన్‌లో కలకలం రేపిన కరోనా స్ట్రెయిన్ వైరస్ ఇపుడు భారత్‌కు దిగుమతి అయింది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఢిల్లీలో ఐదుగురు, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్ సోమవారం రాత్రి లండన్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఐదుగురికి కరోనా  పాజిటివ్. 
 
కరోనా సోకినవారి నమూనాలను పరిశోధన కోసం ఎన్‌సిడిసికి (నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ ) పంపిన అధికారులు లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ చెన్నైలో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను పరిశీలనలో ఉంచిన అధికారులు లండన్‌తో ప్రయాణ సంబందం ఉన్న 1088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కరన్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు