దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు

ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (12:51 IST)
దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చితే రోజువారీ కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ తాజా కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
అదేవిధంగా జాతీయ స్థాయిలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 98.71 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 49,015గా ఉంది. శనివారం నాడు రోజువారీ కేసుల సంఖ్య 7,171గా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31 సాతంగా ఉండగా, వారం రోజుల సగటు పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కు చేరింది. జాతీయ స్థాయిలో సగటు రికవరీ శాతం 98.71 శాతంగా ఉండగా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు