రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. ఆర్‌డీఐఎఫ్ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు డా. రెడ్డీస్ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన రెడ్డీస్.. ఇటీవల వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ట్రయల్స్ ఫలితాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్‌లో స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది.