దేశంలో అదుపులో ఉన్న కరోనా వైరస్

సోమవారం, 16 మే 2022 (12:18 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య ఇప్పటివరకు అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో  మొత్తం 2.97 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 2202 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే 24 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇపుడు దేశంలో మొత్తం 17317 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు దేశంలో 524241 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,25,82,243 మందికి కరోనా నుంచి కోలుకున్నారు. 
 
కాగా, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కొత్త కేసుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. అదేసమయంలో అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ నియబంధనలు, నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు