పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బీహార్‌లోని పాట్నాలో, కొచ్చిలో గ్రాండ్ ఈవెంట్ చేశారు. తాజాగా ముంబయ్‌లో 'పుష్ప-2' హీరో, హీరోయిన్ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని బాలీవుడ్లో విడుదల చేస్తున్న అనిల్ తడానిజీ, భరత్ భూషణ్‌లకు థ్యాంక్స్.. ఫహాద్ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్‌గా వుంది. శ్రీలీల, రష్మికలతో పనిచేయడం ఎంతో హ్యపీ. గత నాలుగు సంవత్సరాలుగా రష్మికతో కలిసి పనిచేశాను. ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స ఎంతో ఎనర్జీ వస్తుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్న హీరోయిన్. ఈ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కావాలి అనిపించేంతగా రష్మిక గొప్పతనం కనిపిస్తుంది.
నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో 20 ఏళ్ల ప్రయాణం మొదలైంది. పుష్ప ఈ రోజు నేను హీరోగా ఇలా వున్నానంటే ఆయనే కారణం నన్ను స్టార్‌ను చేసింది సుకమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నాడు. ఈ సినిమా ఇంత డబ్బు వస్తుంది.. ఇంత పేరు వస్తుందని లెక్కలు వేసుకోని చేయలేదు. ప్రేక్షకులకు ఓ బెస్ట్ సినిమా ఇవ్వాలి. వాళ్లకు గొప్ప ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని వర్క్ చేశాం. ఐదు సంవత్సరాలు మా లైఫ్‌లో బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. బెస్ట్ సినిమా ఇస్తున్నాం. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి దగ్గరి నుంచి, ప్రపంచంలో ప్రతి ఇండియన్, ప్రతి భాష వాళ్లు, ప్రతి రాష్రంలోని వాళ్లు అందరూ కలిసి పుష్ప-2 విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది' అన్నారు.
రష్మిక మందన్నా మాట్లాడుతూ '' ఐదు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ వున్నాయి. పుష్ప దిరైజ్‌లో నా పై చిత్రీకరించిన తొలి సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అల్లు అర్జున్‌తో యాక్ట్ చేయడం అనగానే.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. చాలా నెర్వస్ అయ్యాను. కానీ ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నాను. లాట్ ఆఫ్ ఎమోషన్ష్ ఈ సినిమా చిత్రీకరణలో వున్నాయి. ఈ ఐదు సంవత్సరాల ప్రయాణం ఎంతో బాండింగ్ ఏర్పడింది. డిసెంబర్ 5న మా చిత్రం వస్తుందని గర్వంగా చెబుతున్నాను. సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడుతో పనిచేయడం ఎంతో ప్రౌడ్‌గా ఉంది. అతను మేధస్సు మనలా సాధారణ వ్యక్తి లా ఆలోచించడు. ఆయన సెపరేట్ సెవన్ ఇయర్స్ పుష్ప ఈజ్ మై హోమ్ లా అనిపించింది. ఇలాంటి గొప్ప టీమ్‌తో ఎన్ని సార్లు అయినా పనిచేయడానికి రెడీగా ఉంటాను' అన్నారు.