రాహుల్, అతియాలతో పాటు బాలీవుడ్ నటుడు పంచోలీ, ఆకాంక్షల జంట కూడా కనిపించింది. కాగా, తమ మధ్య ఉన్న సంబంధంపై ఇప్పటివరకూ అటు రాహుల్ గానీ, ఇటు అదియాలు గానీ ఇంతవరకూ నోరు విప్పలేదు.
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ పోటీల్లో కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్, గతంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్‌లతోనూ చట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్, అతియాల జోడీ కూడా కెమెరాకు చిక్కడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తండ్రయ్యాడు. రహానే అర్ధాంగి రాధిక శనివారం నాడు పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ సమయంలో రహానే విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం పట్ల రహానే, రాధిక ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో, తన కుమార్తెను చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఫొటోను రహానే సోషల్ మీడియాలో పంచుకున్నాడు.