పూణేలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గురువారం ఒక వ్యక్తి తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ కనీసం 25 సార్లు చెంపదెబ్బ కొట్టింది. ఆ మహిళ అతనిని పదే పదే హెచ్చరించినప్పటికీ, నేరస్థుడు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. అయితే, ఆ మహిళ జంకకుండా.. పక్కకు పోకుండా నిర్భయంగా తన తరపున నిలబడి, వేధించిన వ్యక్తి కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టడం ప్రారంభించింది.