ఏప్రిల్ 12, 2004కి ఓ ప్రత్యేక ఉంది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అపూర్వమైన రికార్డు నమోదైన రోజు. ఆ రికార్డును నెలకొల్పింది ఎవరో కాదు.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లార్. సరిగ్గా 16 యేళ్ల క్రితం ఇదే రోజున బ్రియాన్ లారా సంప్రదాయ ఫార్మాట్లో 400 పరుగులు మైలురాయిని చేరిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో అప్పటివరకు గ్యారీ సోబెర్స్ (365 నాటౌట్) పేరిట ఉన్న రికార్డు మాయమైపోయింది. పైగా, లారా రికార్డును ఈ 4 యేళ్ళ కాలంలో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా కనీసం దరిదాపులకు కూడా రాలేకపోయారు.
2004, ఏప్రిల్ 12వ తేదీన సెయింట్ జాన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వెస్టిండీస్ జట్టు దిగింది. ఈ ఇన్నింగ్స్‌లో లారా ఏకంగా 582 బంతులు ఎదుర్కొని 43 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 400 పరుగులు చేశాడు.
అయితే వ్యక్తిగత రికార్డు కోసం తొలి ఇన్నింగ్స్‌ను మూడు రోజుల పాటు కొనసాగించడంపై లారాపై కొందరు విమర్శలు చేశారు. ఏదేమైనా లారా నమోదు చేసిన రికార్డు మాత్రం అద్వితీయమే. పైగా, ఈ రికార్డును బద్ధలు కొట్టే క్రికెటర్ ఇపుడు కనుచూపు మేరలో కనిపించడం లేదని చెప్పొచ్చు.