విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారాకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రిలో చికిత్స
మంగళవారం, 25 జూన్ 2019 (15:48 IST)
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. లారా ముంబైలోని ఓ హోటల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు.
ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమం మధ్యలో లారాకు అస్వస్థత రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచ క్రికెట్‌లో లారా తన వినూత్నమైన బ్యాటింగ్ శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. లారా తన పేరిట అనేక రికార్డ్‌లను కలిగి ఉన్నాడు.
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత లారా పలు వ్యాపార సంబంధ కార్యకలాపాలలో మాత్రమే పాల్గొంటున్నాడు. కాగా అతని ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.