నటితో ఐపీఎల్ స్టార్ డేటింగ్... అతనితో తిరిగితే తప్పేంటి అంటున్న హీరోయిన్

గురువారం, 31 మే 2018 (18:54 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్, భారత క్రికెట్ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్.. ఓ బాలీవుడ్ నటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్. వీరిద్దరూ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో చక్కర్లు కొడుతుండగా కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అంతేకాక వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, వీరిద్దరు మరో క్రికెట్-బాలీవుడ్ జంట అని వార్తలు పుట్టుకొచ్చాయి.
 
ఈ వార్తలపై కేఎల్ రాహుల్ పెదవి విప్పకపోగా, నిధి అగర్వాల్ మాత్రం స్పందించింది. 'అవును, నేను రాహుల్‌ కలిసి డిన్నర్‌కి వెళ్లాము. నాకు రాహుల్ ఎప్పటి నుంచో తెలుసు. రాహుల్ క్రికెటర్‌ కాకముందు నేను నటిని కాకముందు నుంచే మా మధ్య పరిచయం ఉంది. మేం ఇద్దరం బెంగళూరులో ఒకే కాలేజీకి వెళ్లకపోయినా.. మా ఇద్దరికి చాలా కాలంగా పరిచయం ఉంది. అందువల్ల అతనితి తిరిగితే తప్పేంటి' అని ప్రశ్నిస్తోంది. 
 
కాగా, కేఎల్ రాహుల్.. ఐపీఎల్ 2018 పదకొండో సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన అర్థ శతకాన్ని బాది కొత్త రికార్డును నెలకొల్పాడు. అయితే ఈ సీజన్ మధ్యలో రాహుల్ బెంగళూరుకు చెందిన ఎలిగ్జర్ నహర్ అనే మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినా రాహుల్ స్పందించలేదు. ప్రస్తుతం నిధి అగర్వాల్ చందు ముండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు