భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ దంపతులు విడిపోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. దీనిపై ధనశ్రీ వర్మ తాజాగా ఓ ట్వీట్ చేయగా, అది వైరల్‌గా మారింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
'కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయం నన్ను నిజంగా బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాను. నేను మౌనంగా ఉంటున్నానంటే దాని అర్ధం బలహీనంగా ఉన్నట్లు కాదు.