ముంబై దాడుల అనంతరం ఇండో-పాక్ క్రికెట్ సిరీస్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ తొమ్మిదో సీజన్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు ఐసీసీ ప్రెసిడెంట్, పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ భారత్ రానున్నారు.
‘బీసీసీఐ నుంచి ఆహ్వానాన్ని అందుకున్నానని, భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్‌కు సంబంధించిన చర్చలకు ఇది మంచి వేదిక అవుతుందని భావిస్తున్నట్లు అబ్బాస్ వెల్లడించారు. ఇంకా పాకిస్థాన్ ఆటగాళ్లని ఐపీఎల్‌లోకి అనుమతించాలని కూడా బీసీసీఐని కోరనున్నట్లు తెలిపారు.