మరోవైపు మొహమ్మద్ కైఫ్ కూడా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన 12 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. లోయర్ ఆర్డర్‌లో జట్టును అనేకసార్లు ఆదుకున్న కైఫ్, ఫీల్డింగ్ చేసేటప్పుడు చిరుతలా కదిలేవాడు. మహ్మద్ కైఫ్ తన క్రికెట్ కెరీర్‌లో 13 టెస్టులు, 125 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక టెస్టుల్లో 624 పరుగులు చేశాడు.
టెస్టు ఫార్మాట్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించగా... అందులో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి కైఫ్ పంపాడు.