సౌతాఫ్రికా చిత్తు... తొలి ట్వంటీ20లో భారత్ విజయభేరీ

సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (09:44 IST)
జొహాన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మెరుపు అర్థసెంచరీకి పేసర్‌ భువనేశ్వర్‌ (5/24) సూపర్‌ షో తోడవ్వడంతో ఆదివారం వాండరర్స్‌ మైదానంలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 28 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 2014 ఏప్రిల్‌ తర్వాత సఫారీలపై భారత్‌ గెలవడం ఇదే తొలిసారి. 
 
ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 203 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (27 బంతుల్లో 1 సిక్స్‌తో 29), కోహ్లీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) రాణించారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21) మెరుపు ఆరంభాన్నిచ్చాడు.
 
ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 పరుగులు 175 పరుగులు చేసి ఓడింది. హెన్‌డ్రిక్స్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 70), బెహర్డీన్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ భువనేశ్వర్‌కు దక్కింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు