విరాట్ కోహ్లీ సేన దక్షిణఫ్రికా గడ్డపై రాణించడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీ సేనను, విరాట్‌పై ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అప్‌గ్రేడెడ్ వర్షన్ లాంటోడని పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ విజయాల పంట పండిస్తుందని కితాబిచ్చాడు.
విదేశీ గడ్డలపై జట్టు మంచి విజయాలను సాధించినప్పటికీ.. గతంలోని అత్యుత్తమ కెప్టెన్‌లతో అతనిని పోల్చడం సరికాదు. వారి స్థాయిని అందుకోవటానికి అతనికి మరింత అనుభవం, విజయాలు అవసరమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీతో కోహ్లిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందని.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నాడని.. కోహ్లీ ఆటతీరు కూడా మెరుగుపడుందని సెహ్వాగ్ తెలిపాడు.