ఒక భారతీయ మహిళా క్రికెటర్ ప్రపంచ క్రీడా యవనికలో శిఖర స్థాయిలో నిలవనున్న క్షణాలివి. అన్నీ అనుకూలిస్తే... ఇదే భీకర్ ఫామ్‌ను ఆమె ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రపంచ కప్ ఫైనల్ ముగిసేలోగానే వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరుకోవచ్చు. ఆ అరుదైన క్షణాల కోసం దేశంలోని క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకునేందుకు అతి కొద్ది దూరంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో మిథాలీ రాజ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో టాప్‌కు చేరడానికి ఐదు పాయింట్ల దూరంలో నిలిచింది మిథాలీ. ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రెండోస్థానంలో నిలిచింది.
నంబర్ వన్ ర్యాంకులో నిలవడానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో మిథాలీ నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (779) టాప్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, మిగతా భారత మహిళా క్రికెటర్లు ఎవరూ టాప్-10లో నిలవక పోవడం గమనార్హం.