ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ ట్వీట్ చేశారు. "ఓ పన్ను చెల్లింపుదారురాలిగా అడుగుతున్నా... ఎన్నో సంవత్సరాలుగా జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? విద్యుత్‌ను ఆదా చేయడానికి మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. అయినా విద్యుత్ సంక్షోభం ఉంది" అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభంపై సాక్షీ ధోనీ చేసిన ట్వీట్‌కు మద్దతుగా అనేక మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, రీ ట్వీట్ చేస్తున్నారు.