భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త విషయాలను నేర్చుకునేందుకు అమితాసక్తిని చూపుతుంటారు. తాజాగా ఆయన ట్రాక్టరుతో పొలం దున్నుతూ కనిపించారు. ఈ ఫోటోకు నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో తన వ్యవసాయక్షేత్రంలో ట్రాక్టరుతో పొలం దుక్కిదున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు.
మరోవైపు, ధోనీ ఫోటో సోషల్ మీడియాలో రెండేళ్ల తర్వాత కనిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. "మొత్తానికి రెండేళ్ల తర్వాత ధోనీకి తన ఇన్‌స్టా పాస్డ్‌వర్డ్ గుర్తుకు వచ్చింది. లవ్ యూ మహి భాయ్" అంటూ కామెంట్ చేసింది.