పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ చిక్కుల్లో పడ్డాడు. 35 ఏళ్ల ఇమాద్ వసీమ్ పాకిస్థాన్ జట్టుకు దూరమై దాదాపు ఏడాది అవుతుంది. జట్టులో చోటు కోల్పోయిన అతడు టీ20 లీగుల్లో ఆడుతున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్‌ఎల్ బరిలోకి దిగిన ఇమాద్ వసీమ్ టైటిల్ తుదిపోరులో సంచలన ప్రదర్శన చేశాడు.