అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు ప్రగ్యాన్ ఓజా గుడ్‌బై

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (14:03 IST)
అంతర్జాతీయ క్రికెట్ కేరీర్‌కు ప్రగ్యాన్ ఓజా గుడ్‌బై చెప్పారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇక నుంచి అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు భావోద్వేగమైన ట్వీట్ చేశారు. తన కెరీర్ అద్భుతంగా ఉండటంతో సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. 
 
2008లో వన్డే అరంగేట్రం చేసి ఓజా.. 2009లో శ్రీలంకపై మొదటి టెస్టు ఆడాడు. ప్రగ్యాన్ ఓజా భారత్ తరపున 24 టెస్టులు, 18 వన్డేలు ఆడి 113 వికెట్లు పడగొట్టాడు. అంతేకాక ఐసీసీ ర్యాంకింగ్‌లో ఐదో స్థానానికి కూడా చేరుకున్నాడు.
 
అటు ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఓజా పర్పుల్ క్యాప్ అందుకున్న మొదటి స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, 2019 వరకు దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన అతడు 2013లో సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ మ్యాచ్‌తో ఓజా చివరిసారిగా దేశానికీ ప్రాతినిథ్యం వహించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు