ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ చెప్పుకుంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము పని చేసే ప్రాంతంలో చంద్రబాబు పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ డ్యాన్స్‌ను వీడియో తీసిన ఇతరులు.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
కాగా, ఈ నెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా ఒంటరిగా పోటీ చేయగా, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఒక కూటమిగా పోటీ చేశాయి. ప్రస్తుతం వస్తున్న అంచనాల మేరకు.. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో టీడీపీ - జనసేన - బీజేపీ కూటిమి అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తూ, భారీగా బెట్టంగులకు పాల్పడుతున్నారు.