ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. 525 బంతుల్లో పుజారా డబుల్ సెంచరీ

ఆదివారం, 19 మార్చి 2017 (19:02 IST)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అదరగొడుతోంది. నాలుగు రోజు ఆటలో ఛతేశ్వర పుజారా డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.  అయితే పుజారా చేసిన డబుల్ సెంచరీలో పెద్ద విశేషముంది. పుజారా తన ద్విశతకాన్ని 525 బంతుల్లో చేశాడు. భారత జట్టు తరపున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేయడానికి ఒక భారత బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్న అత్యధిక బంతులివే కావడం గమనార్హం.
 
అంతకుముందు రాహుల్ ద్రవిడ్ 2004లో రావల్పిండిలో డబుల్ సెంచరీ చేయడానికి ఎదుర్కొన్న 495 బంతులే అత్యధికం. ప్రస్తుతం ఆ రికార్డును పుజారా బ్రేక్ చేశాడు. ఇకపోతే.. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 451/10 పరుగులు సాధించగా, భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ : 23/2 పరుగులు సాధించింది.

వెబ్దునియా పై చదవండి