ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్‌ను కాస్త పక్కనబెట్టి రాకెట్ పట్టాడు. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ధోనీ.. టెన్నిస్‌లోనూ సత్తా చాటాడు. రాంచీలోని జేఎస్‌సీఏ కంట్రీ క్రికెట్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ ధోనీ విజయం సాధించి.. టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ధోని టెన్నిస్ కోర్టులో రాకెట్ పట్టుకుని ఆడుతున్నప్పటి ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.