భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబంపై అతని సోదరుడి మాజీ భార్య ఆకాంక్ష శర్మ చేసిన ఆరోపణలపై మామ, యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ ఘాటుగానే స్పందించారు. యువరాజ్ సింగ్తో సహా నా ముగ్గురు పిల్లుల సింహాలు.. వారు అడ్డమైన గడ్డి తనరంటూ మండిపడ్డారు.
కాగా, తన భర్తతో విడిపోవడానికి యువరాజ్ సింగ్ తల్లే ప్రధానకారణమని ఆకాంక్ష శర్మ ఆరోపించారు. అంతేకాకుండా, యువరాజ్ సింగ్కు గంజాయి తాగే అలవాటు ఉందని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం స్వయంగా యువరాజే తనతో చెప్పాడని చెప్పింది. యువరాజ్ కుటుంబంలో తనకు వేధింపులు ఎప్పుడూ ఉండేవని.. ఆ వేధింపులు తట్టుకోలేక తనుకూడా తన భర్తతో కలసి గంజాయి తాగాల్సివచ్చిందని ఆకాంక్ష శర్మ ఆరోపనలు గుప్పించింది. వీటిని యోగ్ రాజ్ ఖండించారు.