ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రకటన వాయిదా

ఇంగ్లాండ్ సెలెక్టర్లు జట్టు జాబితాకు సంబంధించిన ప్రకటనను వాయిదా వేశారు. మే 6న లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టును రేపు ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు గాయాల బారి నుండి తిరిగి కోలుకుంటుండటంతో వారికి మరింత సమయాన్ని అనుమతించే ప్రక్రియలో భాగంగా జట్టు ప్రకటనను ఇంగ్లాండ్ సెలెక్టర్లు వాయిదా వేశారు.

వాస్తవానికి ఏప్రిల్ 20న జట్టును ప్రకటించాల్సి ఉండగా.. సెలెక్టర్ జెఫ్ మిల్లర్ ఆదేశం మేరకు ఏప్రిల్ 29 వరకు జట్టు ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అదలా ఉంచితే మోచితి గాయం నుంచి ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

అయితే ముందస్తుగా మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఇయాన్ బెల్ పేర్లను కూడా ఈ టెస్ట్ స్క్వాడ్‌లో సెలెక్టర్లు చేర్చడం గమనార్హం. లండన్‌లో మిల్లర్ విలేకరులతో మాట్లాడుతూ, ఆటగాళ్ల జాబితా ప్రకటనను వాయిదా వేయాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలిపాడు. జట్టు ఎంపిక ఆలస్యం అయితే బాగుంటుందని తాము కూడా భావించామని వివరించాడు. దీని వల్ల ఒక చక్కటి అవకాశం చేజారి పోకుండా ఉంటుందని పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి