ఫిక్సింగ్‌పై మాట్లాడేవారు ఆధారాలు చూపించాలి: ముత్తయ్య
మ్యాచ్ ఫిక్సింగ్‌పై మాట్లాడుతున్న వారు దానికి తగ్గట్టు ఆధారాలు చూపించాల్సి ఉంటుందని శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ముత్తయ్య మురళీధరన్ చెప్పాడు. ఫిక్సింగ్ గురించి మాట్లాడుతున్న వారు అందుకు తగ్గట్టు ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని ముత్తయ్య అన్నాడు.
18 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్‌లో ఏ బుకీ కూడా నన్ను సంప్రదించలేదని ముత్తయ్య వ్యాఖ్యానించాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌పై తిలకరత్నే ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశాడో తెలియడం లేదు. ఎవరైనా ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆధారాలు కూడా దగ్గరుంచుకోవాలి. లేకుంటే అతడిపై ఇతరులు దావా వేసే అవకాశం ఉందని ముత్తయ్య పేర్కొన్నాడు.