తన కొడుకు పుట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, కిరణ్ అబ్బవరం ఒక భావోద్వేగ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో, ఆయన తన బిడ్డ సున్నితమైన పాదాలను సున్నితంగా ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది.
ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అనేక మంది ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్యల ప్రేమ ప్రయాణం రాజా వారు రాణి గారు చిత్రం సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేసిన తర్వాత, ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆపై ఇరు కుటుంబీకుల అంగీకారంతో గత ఏడాది వీరికి వివాహం జరిగింది.