సానియాతో ఒడిదుడుకుల్లేవు.. విభేదాల్లేవు: షోయబ్ మాలిక్

శనివారం, 20 డిశెంబరు 2014 (11:09 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో తన సంబంధాన్ని పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ బలపరిచారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దాంపత్య జీవితం ఒడిదుడుకుల్లో పడిందని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై పాకిస్థాన్ క్రికెటర్ స్పందించారు. తమ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు గానీ లేదా విభేదాలు కానీ లేవని చెప్పుకొచ్చారు. 
 
తమ వైవాహిక జీవితం సాఫీగానే సాగుతోందని స్పష్టం చేశాడు. తమ మధ్య దృఢమైన బంధం నెలకొని ఉందని తెలిపాడు. సానియా, తాను దుబాయ్‌లోనే కలిసి ఉంటున్నట్టు గుర్తు చేశాడు. అంతేకాకుండా వీలైనంత ఎక్కువ సమయం ఇద్దరం కలిసి గడిపేందుకు ఇష్టపడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
అదేసమయంలో పాకిస్థాన్ నటి హుమైమా‌తో తనకు ఎలాంటి అఫైర్స్ లేదని స్పష్టం చేశాడు. కేవలం తమ మధ్య స్నేహబంధం మాత్రమే ఉందన్నారు. తన వైవాహిక జీవితంపై వస్తున్న ఇలాంటి నిరాధారమైన వార్తలు చికాకు పరుస్తున్నాయని అన్నాడు. మరోవైపు.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు త్వరలోనే విడిపోనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి