అసలు విషయమేమిటంటే..భారత్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నాల్గో రోజు ఆటలో ఆసీస్ పేసర్ హజల్ వుడ్ 140వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో చటేశ్వర పుజారా బ్యాటింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అయితే ఆ ఓవర్ నాల్గో బంతి లెగ్ స్టంప్ వైపు బౌన్స్ అవుతూ వచ్చింది. దాన్ని పుజారా హుక్ షాట్ కు యత్నించి విఫలమయ్యాడు. కాగా, అంపైర్ గఫానీ మాత్రం ఆ బంతికి కాస్త భిన్నంగా స్పందించాడు. బౌలర్ హజల్ వుడ్ ఎటువంటి అప్పీలు చేయకుండానే తన వేలిని ముందుగా పైకెత్తేసి ఆపై బుర్ర గోక్కున్నాడు.