రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

ఠాగూర్

ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (15:41 IST)
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, శేఖర్ బాషాలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లావణ్య శనివారం హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అంతకుముందు రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఆమె ఇంట్లోకి అనుమతించారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్, తల్లిదండ్రులు బసవరాజ్, రాజేశ్వరి మాట్లాడుతూ, లావణ్య తమ కోడలు కాదని, వారు పెళ్లి చేసుకోలేదని, కేవలం సహజీవనం మాత్రమే చేశారని వెల్లడించారు. అందువల్ల ఆమెను తమ కోడలిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ సమయంలో అందరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు. వారి మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటి వీడియోగా దీనిని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్న నేపథ్యంలో లావణ్య లేదా వారి స్నేహితులే ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారా అనే ప్రచారం సాగుతోంది. 
 
గతంలో ఇంత అన్యోన్యంగా ఉన్న రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఇపుడు తనపై దాడికి పాల్పడ్డారని చెప్పేందుకే లావణ్య ఈ వీడియోను బయటకు విడుదల చేసివుండొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిదన్న అంశంపై స్పష్టత లేదు. 

 

సంచలన వీడియో రిలీజ్ చేసిన లావణ్య

తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్- లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్. లావణ్య సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య రాజ్ తరుణ్ ఆశీర్వాదం… https://t.co/DKVItXtbb6 pic.twitter.com/XIea7BBeCL

— ChotaNews App (@ChotaNewsApp) April 20, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు