విశాఖపట్నం ఎండాడ ప్రాంతంలో నివాసముంటున్నారు శ్రీనివాసరావు, రాజమ్మ. శ్రీనివాసరావు రెవిన్యూ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. కూతురుకు పెళ్ళి చేశాడు. భార్యాభర్తలు మాత్రమే ప్రస్తుతం కలిసి ఉంటున్నారు. శ్రీనివాసరావు కల్లు తాగే అలవాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ పూటుగా మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు.