బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:45 IST)
ఏపీలోని కృష్ణా జిల్లాలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లాలోని కంకిపాడు మండలంలో ఈ ఘటన జరిగింది. ఇది శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 యేళ్ల బాలిక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం తన ఇంటికి వెళ్ళేందుకు బస్టాండులో నిరీక్షిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుంపటి చందు (22), అతని స్నేహితుడు 17తో కలిసి గ్రామానికి వెళుతున్నారు. 
 
బస్టాండులో బాలికను చూడటంతో తనను కూడా ఇంటివద్ద దింపాలని ఆ బాలిక కోరింది. దీంతో సరేనని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి.. రొయ్యూరుకు తీసుకెళ్ళారు. అక్కడ చందు మద్యం సేవించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు... చందుతో అతనికి సహకరించిన మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు