ఆమెను చెరబట్టి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలి తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మయూర్ కోలీపై అపహరణ, చిత్రహింసల కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనుమానితుడు మయూర్‌ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేసారు.
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆ నిందితుడు మళ్లీ మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. భయపడిపోయిన ఆ బాలిక మౌనం పాటించింది. అతడి వేధింపులు తీవ్ర రూపం దాల్చి ఆమె కాలిపై గాయం చేసాడు. దాంతో ఆమెను చికిత్స కోసం చేర్చగా ఆమె గర్భవతి అని తేలింది. నెలలు నిండకుండానే బాలిక ప్రసవించడంతో పుట్టిన పాప చనిపోయింది. తన పట్ల క్రూరంగా ప్రవర్తించిన అతడిపై బాలిక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.