బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

ఠాగూర్

మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (19:43 IST)
బెల్లం, తేనె ఈ రెండూ శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిల్లో ఆరోగ్యానికి పెంపొందించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, నిపుణులు అంటుంటారు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా బెల్లం, తేనెతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఈ రెండు పదార్థాలను ఉయోగిస్తారు. మరి, బెల్లం, తేనె ఈ రెండింటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది. వీటిలో బెస్ట్ అనే విషయం గురించే ఇపుడు మనం తెలుసుకుందాం. 
 
బెల్లం, తేనె రెండూ ఆరోగ్యానికి మంచివే అవి నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో కూడా మంచి పోషకాలు లభిస్తాయని వెల్లడిస్తున్నారు. కానీ తేనెలో కేలరీలు అధికంగా ఉంటాయని, ఇది బరువు పెరగడానికి, రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలకు దోహదపడుతుందని వివరిస్తున్నారు. తేనె ప్రయోజనాలను పొందాలని అనుకుంటే మాత్రం తక్కువ మోతాదులో నియంత్రణంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు