పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కూతురు మంగను స్థానికుడైన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు. నెల రోజులకే మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడంతో మరలా రెండో కుమార్తె స్వప్నను ఇచ్చి వివాహం చేశారు.
వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగా జరిగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు.