ట్రంప్.. ఒకే ఒక్క నినాదంతో అమెరికా అధ్యక్షుడయ్యాడు.. హిల్లరీ 85 నినాదాలు వృధా.. ఎందుకని?

బుధవారం, 9 నవంబరు 2016 (14:48 IST)
గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. కొత్త అమెరికా అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయభేరీ మోగించారు. ఈయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ చిత్తుగా ఓడిపోయారు. అయితే, ట్రంప్, హిల్లరీల విజయానికి ప్రధాన కారణం ఎన్నికల్లో వారు చేసిన నినాదాలే కారణం. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ విజయం కోసం హిల్లరీ క్లింటన్ 85 రకాల నినాదాలు చేశారు. కానీ, డోనాల్డ్ ట్రంప్ మాత్రం కేవలం ఒకే ఒక్క నినాదంతో ముందుకుసాగారు. అదే ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’. ఈ ఒక్క నినాదమే ఆయనను విజయతీరాలకు చేర్చింది. నిజానికి ఈ ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నో రకాలైన విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ ట్రంప్ అమెరిక‌న్లలో జాతీయ భావం నిండేలా ప్ర‌చారం చేసుకున్నారు. అందుకే ఆయన గెలుపును సొంతం చేసుకున్నారు.
 
ప్ర‌పంచాన్ని పీడిస్తోన్న‌ ఉగ్రవాదంపై మండిప‌డుతూ దాన్ని అంత‌మొందించే శ‌క్తి తనకు ఉందని ఒప్పించ‌డంలో ట్రంప్ విజ‌యం సాధించారు. మ‌రోవైపు హిల్లరీ క్లింట‌న్ మాత్రం ఈ అంశాలపై వెన‌క‌ప‌డిపోయారు. అనేక విష‌యాల్లో ఆమెరిక‌న్ల‌కు భరోసా ఇవ్వలేకపోయి చివ‌రికి ఓట‌మిని చవిచూశారు. ఉగ్రవాదంపై ట్రంప్ స్థాయిలో హిల్ల‌రీ క్లింట‌న్ మాట్లాడ‌లేక‌పోయారు. మ‌రోవైపు ట్రంప్‌కి అమెరికాలోని నిరుద్యోగులు, నిరాక్షరాస్యులు మ‌ద్ద‌తుగా నిలిచారు. 

వెబ్దునియా పై చదవండి