ఎమ్మెస్ రాజు చిత్రం 'వాన'లో మీరా చోప్రా

బుధవారం, 22 ఆగస్టు 2007 (18:01 IST)
హీరో పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ మీరా చోప్రా. నిర్మాతలను పలు ఇబ్బందులకు గురి చేస్తుందనే అపవాదును మూటగట్టుకుంది. గతంలో..పారితోషకాన్ని ఇవ్వలేదన్న కారణంగా 'సత్యం శివం సుందరం' చిత్ర నిర్మాతలపై మీరోచోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఎమ్మెస్ రాజు తాజాగా నిర్మించే 'వాన' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో తమిళ హీరో వినయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇదిలావుండగా మీరా చోప్రా తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తుండగా, తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. 'వాన' చిత్రం ఎమ్మెస్.రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందనుంది.

వెబ్దునియా పై చదవండి