కరీనాతో ఆఫైర్స్ నిజమే: సైఫ్ ఆలీఖాన్

శుక్రవారం, 19 అక్టోబరు 2007 (12:39 IST)
తనకు బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ మధ్య సంబంధం ఉన్న మాట నిజమేనని బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ స్పష్టం చేశారు. దీంతో వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గురువారం రాత్రి ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌ ముగింపు కార్యక్రమంలో సైఫ్ దీనిపై నోరు విప్పారు.

ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సైఫ్‌, కరీనా కపూర్ రావడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా గతంలో షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్ కొద్ది రోజులు ప్రేమాయణం సాగించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి