నటి రోహిణి సృజనకు ప్రతిరూపం "సైలెంట్ హ్యూస్"

గురువారం, 14 ఫిబ్రవరి 2008 (17:31 IST)
WD PhotoWD
బాలనటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సినీనటి ఆర్.రోహిణి. తాజాగా ఆమె కొత్త కోణంలో కనిపించనున్నారు. బాలనటిగా వెండితెర ప్రవేశం చేసిన ఈ నటి తన సృజనకు ప్రతిరూపంగా నిర్మించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ "సైలెంట్ హ్యూస్". తమ సొంత నిర్మాణ సంస్థ రాధాస్వామి ఎంటర్‌ప్రైజస్‌పై నిర్మించిన ఈ ఫిల్మ్‌ మొత్తం 52 నిమిషాల నిడితో సాగనుంది. ఇందులో ఆరుగురు చిన్నారులు నటించారు.

బాలనటీనటుల జీవితాల్లో చోటు చేసుకునే అంశాలతో నిర్మించిన "సైలెంట్ హ్యూస్" ఫిల్మ్‌లో వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు, చిన్నారుల భావోద్రేక్రాలను స్పృశిస్తూ సాగుతుందని ఆమె వివరించారు. ఈ ఫిల్మ్‌కు ఆల్పోన్స్‌ రాయ్ సినిమాటోగ్రఫీ చేయగా, ప్రసన్న రామస్వామి సంగీతం సమకూర్చినట్టు "తెలుగు వెబ్‌దునియా"కు ఆమె బుధవారం వివరించారు.

ఐదేళ్ల ప్రాయంలో వెండితెర ప్రవేశం..
తన ఐదేళ్ళ ప్రాయంలో వెండితెరపై ప్రవేశం చేసిన రోహిణి, దక్షిణ భారత భాషల్లో సుమారు 130 సినిమాలకు పైగా నటించారు. తనకున్న సంపూర్ణ సృజనాత్మకతతో ఈ ఫిల్మ్‌ను రూపొందించారు. దీన్ని కొన్నేళ్ల క్రితం ప్రారంభించానని, ఇటీవలే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు చెప్పారు. అనేకంగా ఈనెలలో తెరపై ప్రదర్శిస్తామని వివరించారు.

1996లో ఉత్తమనటి అవార్డు
రోహిణి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం "స్త్రీ". అయితే ఈ చిత్రం విడుదలకు నోచుకోక పోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో రోహిణి
WD PhotoWD
ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి అవార్డుతో సత్కరించింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది. వీటితో పాటు.. "వీరుమండి", "తామరైభరణి", "ఒంబదు రూబాయ్ నోట్టు" అనే తమిళ చిత్రంలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

బుల్లి తెరలో ప్రవేశం...
సినీరంగంతో సత్‌సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. "వీరుక్కు నీర్" అనే టెలీ ఫిల్మ్‌ కోసం అమెకు 2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వరించింది. అంతేకాకుండా సమాజిక అంశాలను ప్రతిబింభించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించారు. అలాగే తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజిఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించారు.