పవన్ కల్యాణ్ లవర్‌తో 'కొరియర్‌ బాయ్‌' రొమాన్స్...!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:51 IST)
FILE
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని అంటూ చెప్పుకుంటూ తిరిగే యంగ్ హీరో నితిన్ పవన్ కల్యాణ్ లవర్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'హార్ట్ ఎటాక్' అనే చిత్రంలో నటించనున్న నితిన్ తన తదుపరి చిత్రాలను డిఫరెంట్ డైరెక్టర్స్‌తో ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు దాదాపు పూర్తయింది. ఇందులో యామీ గౌతమి కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌తో 'హార్ట్ ఎటాక్' సినిమాలో నటించనున్నాడు. తాజాగా ఏయస్ రవికుమార్ చౌదరితో సినిమాను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో కథానాయికగా సమంతాను బుక్ చేస్తున్నారట. పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది'లో నటింటిన తర్వాత సమంత ఇప్పుడు 'మనం' షూటింగ్‌లో బిజీగా ఉంది. అయినప్పటికీ భారీగా పారితోషికం ఆఫర్ చేయడంతో ఆమె కూడా డేట్లు ఎడ్జస్ట్ చేయడానికి రెడీ అవుతోందట. ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ను నిర్ణయించలేదని సమాచారం.

వెబ్దునియా పై చదవండి