ఎన్టీఆర్ అత్తకూతురు ఎవరో.. సమంతనా?.. ప్రణీతనా?

గురువారం, 19 డిశెంబరు 2013 (15:40 IST)
FILE
ఎప్పటికప్పుడు వైవిధ్యబరిమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన స్పీడు మరింత పెంచాడు. యంగ్‌టైగర్ హీరోగా బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత నటిస్తున్నారు. ఈ సినిమాకి 'రభస' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

మంగళవారం నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పదిరోజుల పాటు షూటింగ్ ఇక్కడే నిర్వహిస్తారు. అయితే తన తాత పాటలను రీమేక్ చేసి తన సినిమాలో పెట్టుకునే ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా ఓ పాటను రీమేక్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'కొండవీటి సింహం' సినిమాలోని 'అత్తమడుగువాగులోనా.. అత్త కూతురో' పాటని రీమిక్స్ చేస్తారని సమాచారం. మరి ఈ పాటలో అత్తకూతురు సమంతనో, ప్రణీతనో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి