గౌరవం ప్లాప్ అవుతుందని అనుకోలేదు... యామీ గౌతమ్

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (17:09 IST)
WD
సినిమా సక్సెస్‌లకు ప్రామాణికాలు ఏమిటి. దేన్నిబట్టి సక్సెస్‌ కింద జమకడతారని నటి యామీ గౌతమ్‌ ప్రశ్నిస్తోంది. తెలుగులో నటించిన 'గౌరవం' ప్లాప్‌ చిత్రమవుతుందని అనుకోలేదు. అలాగే బాలీవుడ్‌లో నటించిన విక్కీ డోనర్‌ అద్భుత విజయం సాధిస్తుందని అనుకోలేదని మనస్సులోని మాట చెప్పింది. ఈ చిత్రం ప్రయోగాత్మకంగా తీశారు. అయితేనేం ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

దాంతో ఆమె మరింత ధైర్యంగా సినిమాలు చేయడానికి ముందుకు ఉరకలేస్తుంది. మంచి ఆఫర్లు వస్తున్నాయి అంటోంది. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉండటంతో తెలుగు చిత్రాల్లో ఆలోచించే సమయం లేదని చెబుతోంది.

ప్రభుదేవా దర్శకత్వంలో యాక్షన్‌ జాక్షన్‌ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. కాగా, ఇప్పటికే నితిన్‌తో కమిట్‌ అయ్యాను. ఆ చిత్రం చేస్తున్నాను. మరో రెండు చిత్రాలకు ఆఫర్లు వచ్చాయి. హిందీ తర్వాత చేస్తానని అంటోంది. ఏదైనా హిట్‌ ప్లాప్‌ అనేది మన చేతుల్లో లేదని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి