బ్రహ్మిగాడి "బ్రహ్మి ఆర్ట్ గ్యాలరీ" రెడీ వన్.. టూ.. త్రీ..!!!

బుధవారం, 24 ఆగస్టు 2011 (10:59 IST)
బ్రహ్మిగాడి కథ.. అంటూ తన పేరుమీద టైటిల్‌ పెట్టి చిత్రంలో నటించిన బ్రహ్మనందం చాలా తెలివైనవాడు. గతంలో ఏ ఆర్టిస్టుకు రాని ఆలోచనతో గిన్నిస్‌బుక్‌లో తన పేరు నమోదు చేయించడానికి గుర్తున్నవి, గుర్తులేనివి వెతికి తీసి రెండేళ్లు కష్టపడి కమెడీయన్‌గా ఎక్కువ సినిమాలు చేసిన ఘనుడుగా గిన్నిస్‌ దృష్టి ఆకర్షించాడు.

తాజాగా మరో ఆలోచన మైండ్‌లోకి వచ్చింది. అదేమంటే.. ఫొటోలు సేకరించడం. తను వేసిన విచిత్రమైన వేషాలకు సంబంధించి ఇతర ఫొటోలను సేకరించే పనిలో ఉన్నాడట బ్రహ్మి. ఇప్పటివరకు 280 ఫొటోలు కలెక్ట్‌ చేశాడట. అవన్నీ అవార్డులు, ఫొటో ఎగ్జిబిషన్‌లా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడట.

అక్కినేని ఆర్ట్‌గ్యాలరీగా తను కూడా బ్రహ్మి ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మరి అది ఎక్కడ పెడతాడో, ఆ ఎగ్జిబిషన్‌కు ఎవర్ని బాదుతాడో త్వరలో తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి