మొదట్లో నోకియా.. తర్వాత 'మిస్టర్‌ నూకయ్య' ఏంటి స్టోరీ..?

శుక్రవారం, 9 మార్చి 2012 (16:11 IST)
WD
నటీనటులు: మంచు మనోజ్‌, కీర్తి కర్బంద, సనాఖాన్‌, రాజా, మురళీశర్మ, ఆహుతిప్రసాద్‌, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, వెన్నెల కిషోర్‌ తదితరులు; కెమెరా: బి. రాజశేఖర్‌, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, మాటలు: లక్ష్మీభూపాల్‌, నిర్మాత: డి.ఎస్‌. రావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అని కన్నెగంటి.

సినిమా టైటిల్స్‌లోనే.. నో కాప్షన్‌.. ఓన్లీ యాక్షన్‌ అని స్లైడ్‌ వేయడంతో.. ఇది యాక్షన్‌ మూవీ అని తెలుస్తుంది. దానికి లవ్‌, కిడ్నాప్‌ డ్రామా పెట్టి ముగింపు ఇచ్చాడు.

కథగా చెప్పాలంటే... మిస్టర్‌ నోకియా(నూకయ్య అని పేరుమార్చినా సినిమాలో అలానే పిలుస్తారు)ను కట్టిపడేసి... ఫోన్‌ ఏదిరా? అంటూ కిడ్నాప్‌ గ్యాంగ్‌ లీడర్‌ షాజన్‌(మురళీ శర్మ) హింసింస్తుంటాడు. హీరో నోకియా... ఒక్కసారి గతలోకి వెళతాడు. తనో అనాథ. ఆవారాగా తిరుగుతూ... నోకియా ఫోన్లు దొంగతనం చేస్తాడు. నోకియా, అతని పక్కనే చార్జర్‌(వెన్నెల కిషోర్‌)లు ఇద్దరూ అనాథలే. వారిని తన దగ్గరే ఉంచుకుంటాడు కాలనీ పెద్ద నాంపల్లి (పరుచూరి వెంకటేశ్వరరావు).

తను లవ్‌ చేసిన క్లబ్‌ డాన్సర్‌ శిల్ప(సనాఖాన్‌)ను పెండ్లిచేసుకొని లైఫ్‌ సెటిల్‌ కావడానికి అనూరాధ(కీర్తి కర్బంద) దగ్గరున్న రూ. 2 కోట్లు కొట్టేస్తాడు. ఆమె తన భర్తను కిడ్నాపర్ల నుంచి తెచ్చుకునేందుకు తను పనిచేసే బ్యాంక్‌లోనే కొట్టేస్తుంది. కానీ ఆ డబ్బు లేకపోవడంతో అనురాధ ఆత్మహత్య చేసుకోతుండగా... నోకియా చూసి కాపాడతాడు. విషయం తెలుసుకుని... తను ఈమెకు ద్రోహం చేశానని పరివర్తన చెంది.. ఆమెకు సాయం చేస్తానని హామీ ఇస్తాడు.

అయితే రూ. 2 కోట్లు కొట్టేసింది నోకియానే అని తెలిసి.. అతన్నిఅసహ్యించుకుంటుంది. అదే టైమ్‌లో అనురాధను కిడ్నాపర్లు ఎత్తుకుపోతారు. అది చూసిన నోకియా ఏం చేశాడు? తర్వాత కథేంటి? అనేది సినిమా.

మిస్టర్‌ నోకియాగా మంచు మనోజ్‌ సింగిల్‌ హ్యాండ్‌పై నడిపాడు. దర్శకుడికన్నా తనే ఎక్కువడా డీల్‌ చేసినట్లు.. యాక్షన్‌ సన్నివేశాల్లో తెలిసిపోతుంది. పక్కా మాస్‌ క్యారెక్టర్‌ను మంచు మనోజ్‌ పోషించాడు. గ్లామర్‌ మినహా యాక్షన్‌ చేయడం అతనిలో ప్లస్‌పాయింట్‌. తన పాత్రను బాగా పోషించాడు. ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు నటనకు అవకాశం లేకున్నా... తగిన మోతాదులో నటించారు. వెన్నెల కిషోర్‌ నోకియాతో ఎంటర్‌టైన్‌ చేస్తాడు. మధ్యలో వచ్చే బ్రహ్మానందం... వయస్సు పెరిగినా బుద్ధి పెరగనివాడిలా కాసేపు అలరిస్తాడు. గ్యాంగ్‌స్టర్‌గా మురళీశర్మ పాత్రకు అమరాడు.

టెక్నికల్‌గా.. స్టోరీలైన్‌ చాలా చిన్నది. మెక్సికన్‌ ఫిలిం 'లూసియా లూసియా' చిత్రంలోనిది. స్క్రీన్‌ప్లేను చెప్పడంలో తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు ప్రయత్నించాడు. మొదటి భాగం అల్లరి చిల్లరిగా ఉంటుంది. రెండో భాగంలో కథ కాస్త సాగుతుంది. అది కూడా రొటీన్‌గా ఉన్నా కొన్ని ట్విస్ట్‌లు కన్పిస్తాయి.

పాటలపరంగా యువన్‌శంకర్‌ రాజా పాప్‌, జాజ్‌ వంటి యూత్‌ సంగీతాన్ని ఇచ్చాడు. ఫాస్ట్‌గా సాగే ఈ పాటలు యూత్‌ మినహా మిగిలినవారికి నచ్చవు. లక్ష్మీభూపాల్‌ సంభాషణలు జస్ట్‌ ఓకే. ఎడిటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుంటేది.

ఇందులో చెప్పాల్సింది ముఖ్యంగా మనోజ్‌ యాక్షన్‌ సీన్స్‌. స్క్రీన్‌ప్లేను నడిపిన దర్శకుడిది. మొదటి భాగం గందరగోళంగా ఉన్నా.. రెండో భాగంలో కాస్త కంట్రోల్‌ అయింది కాబట్టే సినిమాగా మిగిలింది. మిస్టర్‌ నూకయ్య అనేది కొత్తదనం కోరుకునే వారికి ఓకే కానీ... మరి అటువంటి కొత్తదనం చూసే ప్రేక్షకులు వస్తే సరే... లేదంటే..

వెబ్దునియా పై చదవండి