తిమింగలాలు పిల్ల తిమింగలాలికి పాలు ఇస్తాయంటా...!

శుక్రవారం, 16 డిశెంబరు 2011 (17:35 IST)
తిమింగలాలు చేపల జాతికి చెందినవని కొందరు అనుకొంటారు. ఎందుకంటే వాటి ఆకారం చేపలాగ ఉంటుంది కాబట్టి. కానీ తిమింగలాలు చేప జాతికి చెందదు. క్షీరదాల జాతికి చెందుతాయి. క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులు. మిగతా అన్ని క్షీరదాలలాగానే తిమింగలాలు ఉష్ణరక్త జంతువులు. వాటిలాగానే గాలిని పీల్చుకుంటాయి. శరీరంపై వెంట్రుకలు ఉంటాయి. క్షీరగ్రంధుల ద్వారా పిల్లలకు పాలిస్తాయి.

ఆడ తిమింగలాలు పిల్లల్ని కన్న తర్వాత టూత్ పేస్టు అంత చిక్కగా ఉండే పాలను పిల్లల నోట్లోకి చిమ్ముతాయి. తిమింగలాలు సంవత్సరం పాటు పాలిచ్చి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాయి. కొన్నిరకాల తిమింగలాలు సంవత్సరం కన్నా ఎక్కువకాలమే పిల్లలకు పాలిస్తాయి. సుమారు పది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత తిమింగలాలకి పునరుత్పత్తి చేసే సామర్థ్యం వస్తుంది.

వెబ్దునియా పై చదవండి