శరీరం చలాకీగా ఉండాలంటే శరీరానికి మాలిష్ చాలా అవసరం. దీంతో శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగుంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.
ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి మాలిష్ ప్రధాన భూమిక పోషిస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఉరుకులు పరుగులమయమైన ఈ జీవితంలో ఆరోగ్యంగురించే పట్టించుకోవడంలేదు. పైగా శరీరానికి మాలిష్ గురించి ఆలోచన ఎక్కడిది అంటారా...!
మాలిష్ అనేది కేవలం శరీరంలోని అలసటను మాత్రమే దూరం చేస్తుందనుకుంటే పొరబాటు పడినట్లే. ఇది శరీరంలోని రక్త ప్రసరణకూడా బాగా జరుగుతుంది. దీంతో అనేక రోగాలు వాటంతట అవే దూరమైపోతాయంటున్నారు వైద్యులు.
వాతావరణానుసారం నూనెను వాడండి. వేసవి కాలంలో కొబ్బరి నూనె, చలికాలంలో ఆవాలనూనెతో శరీరాన్ని మాలిష్ చేయండి.
మాలిష్ అంటే రెండు విధాలుగా ఉంటాయి. 1. నూనె లేకుండా మాలిష్ చేయడం. 2. శరీరానికి నూనెపూసి మాలిష్ చేయడం.
నూనె లేకుండా మాలిష్ చేసేటప్పుడు అరచేతులతో శరీరాన్నంతటిని రుద్దాలి. నూనెతో మాలిష్ చేసేటప్పుడు శరీరం పూర్తి నూనెను గ్రహించిన తర్వాత మాలిష్ చేయండి. దీంతో ఆరోగ్యం మీవెంటే అంటున్నారు వైద్యులు.